Wednesday, March 20, 2024



💕గజల్ 💕
కలలు జారి పోతుంటే నీ తలపులు భద్రం!
నీళ్ళు పడిన నేల పైన నీ అడుగులు భద్రం!

సంపాదన కైపు లోన కన్ను మిన్ను కానవు
వయసు బుసలు కొడుతుంటే ఆ పరుగులు భద్రం!

సంసారం సాగరమే సుడులున్నా తప్పదు
నాటు పడవ షికారు లో ఆ అతుకులు భద్రం!

లక్ష్యం పవిత్ర మైతే నీదేలె తుది గెలుపు 
కోర్కెల వలలొ దేవుడి కిచ్చె ముడుపులు భద్రం!

కాలానికి సరిదిద్దే ఒడుపున్నది తెలుసా
ఈ రంగుల రాట్నం లో నీ పదవులు భద్రం!

అయిన వాళ్ళు కాని వాళ్ళు అన్నీ ఒక ముసుగే
గాలి ఎక్కు వై నపుడే మీ గొడుగులు భద్రం!

ఎందుకు ఈ ద్వేషాలూ వైరాలు ముకుందా
మనసారా సాగ నంపు ఆ మనుషులు భద్రం!
-----------------------------;-------------------------------
తెలుగు గజల్...
రచన.. ఆచార్య ముకుంద సుబ్రహ్మణ్య శర్మ
           వరంగల్
ఈ గజల్ పూర్తిగా నా స్వంతమే అని ధృవీకరించు చున్నాను..
      ఇట్లు
ముకుంద శర్మ 
విశ్రాంతి ఆచార్య
కాకతీయ విశ్వవిద్యాలయం
వరంగల్ 506009 India
Mob 9849257174

Sunday, June 5, 2022

ఏడుకొండలు

నామాల సామివే నీకంత బిగు వేమి 
పిలిచినా పలుకవే నాతోటి తగు వేమి 
ఏడాది ఏడాది నీ కొండ కొచ్చాను
నువ్వొక్క సారైన నను చూడ రావేమి 

కొండంత కోరికలు నే నిన్నడగ లేదు 
మెండైన సేవలను నే అర్పించ లేదు 
నా హృదయమే పసిడి సింహాసనం
అందుకో అక్కడే  కర్పూర నీరాజనం 


ఉన్నదేదో నీకు కానుకగ ఇచ్చాను
సల్లంగ నీవల్ల ఎదుగుతూ వచ్చాను
భక్తితో ప్రతి ముడుపు నీకొరకుతెచ్చాను

కోనేటి రాయుడు మాపాలి దేవుడు 
కరుణాల వాలుడు మాశ్రీని వాసుడు 

ఆ ఏడు కొండ ల్లో ఏముందొ నీ మాయ
చిటిక లో కష్టాలు మరిపించు ఆ మాయ

ఇచ్చింది వడ్డీ తొ తిరిగిచ్చు వాడివే
ఈ బ్రతుకు కష్టాలు కడ చేర్చు ఓడవే

తెలివైన కోరికని నే కోర లేదేమొ
ఈ సిరులు భోగాలు ఎన్నున్న లోటేమొ
సంసార జల ధి లో పట్టింది జలగేమొ
కరుణించి నీ కృపకి చూపించు దారేమొ 

ఏమిచ్చి నీ ఋణము నే తీర్చు కో గలను
శ్రీ లక్ష్మి ఇల్లాలు దేవతలు బంధువులు
నీ గుడికి ఓ మట్టి ప్రమి దౌ వ్వ గలను!

Friday, October 22, 2021

ఫైనల్ practice

♦️🌹   గజల్  ♦️🌹  pract12

జాబిలే ఆమెగా మారెనే వింతగా!
సంద్రమే  నెచ్చెలై నవ్వె నే వింతగా!
జాబిలే ఆమెగా మారెనే వింతగా!

ఊర్వశీ సోయగం ఉందిలే ఆమెలో
వెన్నెలే ఆమె తో ఆడెనే   వింతగా!
జాబిలే ఆమెగా మారెనే వింతగా!



ప్రాయమా ఎందుకే,.చుట్ట మై వాలడం 
అందమే  కనుకై వచ్చెనే  వింతగా!
జాబిలే ఆమెగా మారెనే వింతగా!

ఎందుకో నిన్నలా...లేదులే  లోకమే
అన్నిటా తానుగా తోచెనే  వింతగా
జాబిలే ఆమెగా మారెనే వింతగా!



యవ్వనం పువ్వురా..,నవ్వినా వాడదా
తత్వమే అందులో దాగెనే వింతగా!
జాబిలే ఆమెగా మారెనే వింతగా!

దాహమే  తీర్చనీ...  సాగరం ప్రేమరా
మోహమే  భ్రాంతిగా  తేలెనే వింతగా!
జాబిలే ఆమెగా మారెనే వింతగా!


జీవితం  నాటకం ఆటలా సాగిపో 
పాత్రలే మధ్యలో వీడెనే వింతగా!
జాబిలే ఆమెగా మారెనే వింతగా!
సంద్రమే  నెచ్చెలై నవ్వె నే వింతగా!
-----------------------------------------------

pract13

♦️🌹   గజల్  ♦️🌹  pract12

జాబిలే ఆమెగా మారెనే వింతగా!
సంద్రమే  నెచ్చెలై నవ్వె నే వింతగా!

ఊర్వశీ సోయగం ఉందిలే ఆమెలో
వెన్నెలే ఆమె తో ఆడె నే   వింతగా!

ప్రాయమా ఎందుకే,..చుట్ట మై వాలడం 
అందమే  కనుకై వచ్చెనే  వింతగా!

ఎందుకో నిన్నలా...లేదులే  లోకమే
అన్నిటా తానుగా తోచెనే  వింతగా

యవ్వనం పువ్వురా..,నవ్వినా వాడదా
తత్వమే అందులో దాగెనే వింతగా!

దాహమే  తీర్చనీ...  సంద్రమే  ప్రేమరా
మోహమే  భ్రాంతిగా  తేలెనే వింతగా!

 జీవితం  నాటకం ఆటలా సాగిపో 
పాత్రలే మధ్యలో వీడెనే వింతగా!
-----------------------------------------------

Tuesday, June 15, 2021

Anger

Anger Management

Emotional unpleasant state of beeing reflected in physiological  and biological clues of an indibidual. It is a natural human emotion which we  all experience  one time or other.
Where mind and body refuse to listen  Your instructions you loose control on your actions .
Loud Voice  Red Face Increased Heart Beat
Increased BP  sweat shivering shouting
Injuring Self or others Dis Functional Behavior 
are the extternal symptoms of anger. Of course 
 they Vary  from person to person. Typically triggered by threat real or imaginary, injustice  frustration. Strong feeling of displessure and urge to fight back. Learn to express politely rather than beeing verbally or physically assertive.

FIRES
F
Fear                
Frustration
Failure  Defence 
  I
Inability
 Injustice
Insecurity 
   R
Relation ships
Rejection
Resentement 
    E
Experience
Embrrasment 
Enevy jelous
 S
Stress
Self Esteem
Situation 


------------------------------------===----------======------==-


Mother in law  Insecurity
Daughter in Law fear of Dominence
Son  threat to status 
Employee  Equity justice 
Brothers &Sisters
Fear of Failure
Loss of freedom 
Experience
Inferirity
Fear punishment
Fear
Stress
Loss & Failure
Recognition
Ignorence
Inability
Frustration
Impulsive behavior
BP Vs Anger
Self control
Weakness 
Relations
Heart Beat 
Symptoms
Outlet
Avoid
Accept
Express 
Fuels Conflicts
Impaired Relation Ships
Defense Mechanism
Depriving Basic Needs

Attitude
     Irritant temperment
Stress
Fear
Inability
Experience

Loud Voice  Red Face Increased Heart Beat
Increased BP  sweat shivering shouting
Injuring Self or others Dis Functional Behavior 

FIRE
F
Fear                
Frustration
Failure  Defence 
  I
Inability
 Injustice
Insecurity 
   R
Relation ships
Rejection
Resentement 
    E
Experience
Embrrasment 
Enevy jelous
 S
Stress
Self Esteem
Situation 



Wednesday, September 11, 2019

హైమ

సాధిస్తావు కష్టపడితే  జీవితాన నీ గెలుపు !
సోమరిపోతుకివెతికినా ఉండదులే ఏ మలుపు!

నలుగురితోపంచుకుంటే నీళ్ళైనా పాయసము
ఒంటరిగానె అనుభవిస్తే వస్తుందిలె ఆయసము!

చెప్పుకుంటే వస్తుందా పోయిన నిన్నటి పరువు
చేతులతో ఆగుతుందా కట్టతెగిన ఆచెరువు!

సాయపడిన ఉడతపైనే రాసెనుకాలం కవిత
పరులకోసం జీవిస్తే  అదేరాయునీ చరిత!

Sunday, April 14, 2019

గజల్ 113

గజల్ 112 -బహర్
నీమనసే కానుకగామార్చి చూడు !
ఆతలపే  వెన్నెలగా మార్చి చూడు!

కోపమనే  నిప్పులలో కాల్చుకోకు
వేదననే తేనియగా మార్చిచూడు!

సంపదలో సౌఖ్యమునే చూసుకోకు
త్యాగమునే బాసటగా  మార్చిచూడు!

చింతలనే పంచుకునే  మాట చాలు
మాటలనే  సాధనగా మార్చిచూడు!

ఒంటరిగా బాధలనే దాచుకోకు
స్నేహమునే సంపదగా మార్చిచూడు !

బహర్: ముఫ్ తయిలున్ , ముఫ్
తయిలున్, ఫాయిలాన్. (ఇది‌ అరబీ
బహర్ )..